తిరుమలపై కరోనా ప్రభావం... 15 నిమిషాల్లోనే దర్శనం.. - 15 నిమిషాల్లోనే పూర్తవుతున్న శ్రీవారి దర్శనం
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండ వెలవెలబోతోంది. శ్రీవారి దర్శనానికి రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నుంచి.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. కొవిడ్ ఉద్ధృతి కారణంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు స్వామి సన్నిధికి వస్తున్నారు.
భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల
కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమల కొండపై కర్ఫ్యూ వాతావరణం కనపడుతోంది. 15 నిమిషాల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు కొనుగోలు చేయడం లేదు. మహాద్వారం వద్ద భక్తులు లేక క్యూలైన్లు అప్పుడప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 8 వేల మంది భక్తులు మాత్రమే వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారికి హర్ష టయోటా వాహనం విరాళం