TTD VAIKUNTA DARSHANAM: తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 13 నుంచి 22 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. 10 రోజులపాటు రోజుకు 5 వేల చొప్పున 50 వేల టికెట్లు స్ధానికులకు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇవాళ్టి నుంచి టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే ప్రకటించినా.. ఆదివారం సాయంత్రం నుంచి తిరుపతి నగరంలో టికెట్లు జారీ చేసే కేంద్రాలకు భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే జారీ చేసింది. నగరంలోని రామచంద్ర పుష్కరణి, ఎమ్మార్ పల్లి జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్, నగరపాలక సంస్ధ కేంద్రాలలో టికెట్ల జారీ కొనసాగించింది. ఉదయం 9 గంటల సమయానికే టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది.
ఇదీ చదవండి: