tirumala vaikunta ekadasi: వైకుంఠ ఏకాదాశి సందర్భంగా తిరుమలను అందంగా ముస్తాబు చేశారు. గురవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరవనున్నారు. ధనుర్మాస పూజల తర్వాత వేకువజామున 1.45 నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం 11 మంది మంత్రులు, 33 మంది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు రానున్నారు. ఇప్పటి వరకు 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుమలకు చేరుకున్నారు.
రేపటి నుంచి ఈనెల 22 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. 10 రోజులపాటు రోజుకు 5 వేల చొప్పున 50 వేల టికెట్లు స్ధానికులకు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే భక్తులు భారీగా తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే జారీ చేసింది. నగరంలోని రామచంద్ర పుష్కరణి, ఎమ్మార్ పల్లి జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్, నగరపాలక సంస్ధ కేంద్రాలలో టికెట్ల జారీ కొనసాగించింది.
ఇదీ చదవండి: