హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జనవరి 15వ తేదీన సంక్రాంతి కనుమ పర్వదినాన మనగుడి - గోపూజ కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, గురువాయూరులోనూ గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తీతీదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆలయాల్లో గోవుకు సంప్రదాయబద్ధంగా పూజ, ధార్మికోపన్యాసం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
అకాలమృత్యుహరణ మహాయజ్ఞం
విశ్వంలోని సకలప్రాణికోటికి మృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని తిరుపతిలోని కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో తీతీదే అకాలమృత్యుహరణ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. ఈ నెల 20వ తేదీ వరకు మహాయజ్ఞం జరగనుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 51 మంది కృష్ణయజుర్వేద పండితులు, ఎస్వీ వేద వర్సిటీ ఆచార్యులు ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈ యజ్ఞం జరుగుతోంది.
ఇదీ చదవండి: