ETV Bharat / city

వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే...

వైకుంఠ ద్వార దర్శనం గతంలో మాదిరిగా రెండ్రోజులే మాత్రమే ఉంటుందని తితిదే ఛైర్మన్ వెల్లడించారు. హైకోర్టు సూచనల మేరకు బోర్డు అత్యవసర సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

pilgrims in tirumala on the occasion of vikunta ekadasi
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు
author img

By

Published : Jan 5, 2020, 6:22 PM IST

Updated : Jan 6, 2020, 7:28 AM IST

బోర్డు నిర్ణయాలను వెల్లడిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సాధారణ రద్దీతో ఉన్న సప్తగిరులు ఆదివారం మధ్యాహ్నం తర్వాత పోటెత్తాయి. నారాయణగిరి ఉద్యానవనంలో సుమారు 30వేల మంది సేదదీరేలా 17 షెడ్లను నిర్మించారు. ఆలయ మాడవీధుల వెంట సుమారు 24 వేల మంది విశ్రాంతి తీసుకునేలా షెడ్లు వేశారు. గ్యాలరీల్లో మరో 40వేల మంది వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. కల్యాణవేదికలోనూ సుమారు 4వేల మందికి వసతి కల్పిస్తున్నారు. దాదాపు 90 వేల మందితో అన్ని వసతి కేంద్రాలు నిండిపోవడం వల్ల ఆదివారం మధ్యాహ్నం రెండింటి నుంచి క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వైకుంఠం క్యూకాంప్లెక్సు నుంచి ద్వాదశి దర్శనానికి అనుమతిస్తారు. షెడ్లలో సేదదీరే సుమారు 60వేల మంది చలికి ఇబ్బంది పడకుండా తితిదే దుప్పట్లు ఇచ్చింది. మొబైల్‌ టాయిలెట్లు, ఇతర వసతులను సమకూర్చింది. మరోపక్క తితిదే చేపట్టిన విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల ప్రతిమలు, దేశవిదేశీ ఫలపుష్పాలతో అలంకరించిన మండపాలతో ఆలయం తళుకులీనుతోంది.

అర్ధరాత్రి నుంచి దర్శనం
భక్తులందరికీ వైకుంఠద్వార దర్శనం కల్పించే లక్ష్యంతో ఆదివారం రాత్రి పవళింపు సేవను రోజుకంటే గంట ముందే తితిదే ముగించింది. ఇవాళ తెల్లవారుజామున 1.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ధనుర్మాస కైంకర్యాలు పూర్తి చేసి రెండింటికి వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రారంభించింది. వారితోపాటు శ్రీవాణి ట్రస్టు ద్వారా నమోదు చేసుకున్న వారికి మహాలఘు దర్శనం కల్పించింది. ఉదయం ఐదు గంటలనుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామి ఇవాళ ఉదయం 9 నుంచి 11గంటల వరకు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు. ఉత్తరద్వార దర్శనం కోసం ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరిలో రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.

ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లోనే వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనం గతంలో మాదిరిగా రెండ్రోజులే మాత్రమే ఉంటుందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు కల్పించాలని కోరుతూ తాళ్లపాక రాఘవన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... పిటిషనర్​అభ్యర్థనపై వైఖరేంటో తెలపాలని తితిదేని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అన్నమయ్య భవన్‌లో తితిదే ధర్మకర్తల మండలి అత్యవసరంగా సమావేశమై ఈ విషయాన్ని చర్చించింది. గతంలో మాదిరిగా రెండు రోజుల పాటే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఈ విషయాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులకు జనవరి 20 నుంచి ఉచిత లడ్డూ అందజేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. రూ.50కు అదనపు లడ్డూ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:తిరుమలకు వెల్లువలా భక్తులు.. ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

sample description
Last Updated : Jan 6, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.