గోవిందమాల పుస్తకాల పంపిణీని తితిదే అధికారులు అడ్టుకోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం చాటేలా రూపొందించిన గోవింద మాల అనే పుస్తకాలను యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి కొందరు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇంతలో తితిదే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పుస్తకాలను పంచడాన్ని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పంచకూడదని అదేశించారు... శ్రీవారి పై భక్తిని పెంచేలా చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. హిందూ దేవాలయంలో హిందూ మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ లేదంటూ ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: 'తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు రద్దు చేయాలి'