fake jobs on ttd: తితిదేలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తితిదే హెచ్చరించింది. ‘ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తితిదేలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, తితిదే వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. అవాస్తవ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని తితిదే స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: