తిరుమల(tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే(ttd) విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 17 నుంచి నాలుగు రోజల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ రోజులకు సంబంధించి.. ప్రత్యేక టికెట్లను విడుదల చేశారు. టికెట్లను విడుదల చేసిన కొంత సమయానికే చాలా వరకు అమ్ముడుపోయాయి. అధికసంఖ్యలో భక్తులు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబర్చడంతో.. వెబ్‌సైట్ స్తంభించింది.
ఇదీ చదవండి:
viveka murder case: సునీల్‌ను కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ అధికారులు