జమ్ముకశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణాలు చేపట్టేందుకు తితిదే చర్యలు ప్రారంభించింది. జమ్ము కశ్మీర్లో స్థల పరిశీలన కోసం తితిదే అధికార యంత్రాంగం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఆక్కడి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను కేటాయించగా... వాటిలో ఆలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని తితిదే అధికారులు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌తో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు జమ్మూకు పయనమయ్యారు.
ఇవీ చదవండి.. ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల