ETV Bharat / city

ఏకాంతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అనుమతి నిరాకరణ

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించబోమని తితిదే స్పష్టం చేసింది. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో బసంత్​కుమార్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ttd jeo discussions on brahmotsavalu
బ్రహ్మోత్సవాలపై తితిదే జేఈవో చర్చలు
author img

By

Published : Oct 28, 2020, 10:49 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది రోజులు జరుగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఆస్థాన మండపంలో జేఈవో బసంత్​కుమార్ సమీక్ష చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండానే.. పంచమి తీర్థం నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు.

goddess tiruchanuru padmavati
తిరుచానూరు పద్మావతి అమ్మవారు

అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆగమ సలహాదారులు, జీయ్యంగార్ల ప్రతినిధులు, అధికారులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొవిడ్-19 మార్గదర్శకాలను ఉద్యోగులు తప్పకుండా పాటించాలని జేఈవో సూచించారు. ఉద్యాన, విద్యుత్ విభాగాల అధికారులు.. ఆలయ ఆవరణలోనే అలంకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవవండి: వకుళమాత ఆలయ పనులు వేగవంతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.