తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీని రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి తితిదే ప్రారంభించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఈ టోకెన్లు జారీ చేస్తోంది. గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి టోకెన్ల పంపిణీ ప్రారంభించిన తితిదే... రాత్రి 10 గంటలకు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను మూసివేసింది.
ఇవాళ ఉదయం నుంచి నగరంలోని 5 కేంద్రాల్లో 50 కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను తితిదే అధికారులు జారీ చేస్తున్నారు. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం స్థానికులకే సర్వ దర్శనం టోకెన్లను ఇస్తామని ప్రకటించినా.... రాత్రి నుంచి లైన్లలో నిలబడిన స్థానికేతరులకు కూడా టోకెన్లను అందిస్తోంది.
ఇదీ చదవండి