తితిదే నిర్వహణలో ఉన్న బర్డ్, స్విమ్స్, కేంద్రీయ ఆసుపత్రికి అవసరమయ్యే మందులు, పరికరాల కొనుగోలుకు కేంద్రీయ ప్రొక్యూర్మెంట్ సెల్ ఏర్పాటు చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిని రోగుల సహాయ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని.. సహాయ కేంద్రాలు, రిసెప్షన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను వెంటనే ఉపయోగంలోకి తేవాలన్నారు.
కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని బలోపేతం చేయాలని.. అధునాతన పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే నెల చివరి నాటికి క్యాథ్ ల్యాబ్ రోగులకు అందుబాటులోకి తేవాలన్నారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు బర్డ్‌కు వచ్చి శ్రీవారి సేవగా వైద్య సేవలు, ఆపరేషన్లు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఈవో, బర్డ్ ఎండి ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, సీవీ ఎస్వో గోపీనాథ్ జెట్టి, బర్డ్ గౌరవ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: