ETV Bharat / city

TIRUMALA: తిరుమలను హోలీ గ్రీన్​ హిల్స్​గా మారుస్తాం: జవహర్​రెడ్డి

నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13 నుంచి ఏడు బ్రాండ్లతో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు.

ttd
తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి
author img

By

Published : Sep 4, 2021, 6:24 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 13 నుంచి ఏడు బ్రాండ్లతో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్‌ హిల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.

డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను వినియోగిస్తామని జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. మొదటి దశలో 35 విద్యుత్‌ కార్లను తిరుమ‌లలోని సీనియ‌ర్ అధికారుల‌కు అందించినట్లు తెలిపారు. రెండో ద‌శ‌లో యాత్రికులకు ఉచిత బ‌స్సులు ప్రారంభిస్తామన్నారు. తిరుమల-తిరుపతి మధ్య ఆర్‌టీసీ విద్యుత్ బస్సులను న‌డిపే ప్రక్రియ తుది ద‌శ‌లో ఉందన్నారు.

మూడో ద‌శ‌లో ట్యాక్సీలను విద్యుత్‌ వాహనాలుగా మార్పించే ప్రయత్నం చేస్తామన్నారు. లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యూట్‌ సంచులు, గ్రీన్‌ మంత్ర సంస్థ పర్యావరణహిత కవర్లు విక్రయిస్తున్నామని తెలిపారు.

ఇటీవల డీఆర్‌డీఓ సంస్థ సాంకేతిక ప‌రిజ్ఞానంతో, మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ భాషలలో తితిదే ఛానళ్ళు అక్టోబరు నెలలో ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.

ఇదీ చదవండి: ttd:దేవాదాయ శాఖకు తితిదే మరింత చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.