తిరుమలలోని ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రాన్ని తితిదే ఈవో జవహార్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి పరిశీలించారు. అక్కడ వినియోగించే తాగునీరు, పాలు, నెయ్యి, నూనెలు, పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిశోధన కేంద్రం, పిండిమిల్లులను పరిశీలించారు. పలు అంశాలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్న ప్రముఖులు