తితిదే వంటి ప్రముఖ ధార్మిక సంస్థలో 3 సంవత్సరాల 5 నెలలు సంతృప్తికరంగా సేవలందించేందుకు సహకరించిన తితిదేలోని అన్నివిభాగాల అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై సింఘాల్ వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో సమష్టిగా పనిచేసి భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులను కోరారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అనిల్‌కుమార్ సింఘాల్ పాలనలో తనముద్ర వేశారని కొనియాడారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారంటూ అభినందించారు. పూర్వపు ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ తరువాత సుదీర్ఘకాలం సేవలందించిన ఈవోగా గుర్తింపు పొందారని చెప్పారు. ఈవోకు శ్రీవారి జ్ఞాపికను అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..