ETV Bharat / city

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: ఈవో అనిల్​ సింఘాల్​ - తితిదే ఆస్తులపై శ్వేతపత్రం వార్తలు

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తితిదే ఈవో అనిల్​ కుమార్​ సింఘాల్​ తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జూన్ 11 నుంచి జులై 10 వరకు రూ.16.73 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకినట్లు స్పష్టం చేసిన ఈవో... అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు చేసినట్లు వివరించారు.

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: ఈవో అనిల్​ సింఘాల్​

author img

By

Published : Jul 12, 2020, 11:57 AM IST

Updated : Jul 12, 2020, 12:43 PM IST

తిరుమలలో 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకిందని తితిదే ఈవో అనిల్​కుమార్​ సింఘాల్​ తెలిపారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తునికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. తిరుపతి పరిపాలన భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలిపిరి వద్ద 1,704, తిరుమలలో 1,865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించామని.. మొత్తం 631 మంది యాత్రికులకు కరోనా పరీక్షలు చేశామని వెల్లడించారు.

రూ.16.73 కోట్ల ఆదాయం

జూన్ 11 నుంచి జులై 10 వరకు రూ.16.73 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో అనిల్​ కుమార్​ సింఘాల్​ తెలిపారు. తలనీలాల విలువ పెరగడం వల్ల రూ.7 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. మొత్తం 13.36 లక్షల లడ్డూలు విక్రయించామని.. 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. లక్షా 64 వేల మంది ఆన్‌లైన్ ద్వారా.. 85,434 మంది భక్తులు కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్​ చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని తెలిపారు.

ఆస్తులపై శ్వేతపత్రం

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నామని.. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయి పరిశీలన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈవో అనిల్​ సింఘాల్​ స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి..

ఆకర్షణీయం.. ఆశ్చర్యం.. చెట్లకు కరోనా పువ్వులు..!

Last Updated : Jul 12, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.