భారీ వర్షాల వల్ల తితిదేకు రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV subba reddy) వెల్లడించారు. తిరుమలలో 30 ఏళ్లుగా ఎప్పుడూ లేని వర్షం ఈసారి (rains in tirumala) కురిసిందన్నారు. ఘాట్ రోడ్‌లోని 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, 5 చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయని వైవీ స్పష్టం చేశారు.
నారాయణగిరి అతిథి గృహం, కపిలతీర్థం మండపాలు దెబ్బతిన్నాయన్నారు. ఘాట్ రోడ్లు, మెట్లమార్గంలో వెంటనే మరమ్మతు పనులు చేపట్టామన్న వైవీ.. తిరుమల వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు.
ఇదీ చదవండి