ETV Bharat / city

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం - tirumala latest news

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశమైంది. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య పెంచడంతో పాటు 85 అంశాలపై చర్చించనున్నారు.

ttd board meet starts
ttd board meet starts
author img

By

Published : Jun 19, 2021, 11:11 AM IST

తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే బోర్డు సమావేశం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశమైంది. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, ఎక్స్‌అఫీషియో సభ్యులు చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతిలో గరుడవారధి అలిపిరి వరకు నిర్మాణానికి నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో నిరంతరాయంగా నైవేద్యంపై చర్చించే అవకాశం ఉంది.

వరాహస్వామి ఆలయ వెండి వాహిలి నిర్మాణానికి 180 కిలోల వెండి కేటాయింపుపైనా చర్చించనున్నారు. తిరుమలలో కొత్తగా 13 వందల 89 సీసీ కెమేరాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి రెండు సంవత్సరాల పదవీ కాలం ఈనెల 21తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశమే ప్రస్తుత ధర్మకర్తల మండలికి చివరి భేటీ కానుంది. ఈ సమావేశంలో గడచిన మూడు నెలల కాలంలో కొనుగోలు చేసిన నిత్యావసరాల చెల్లింపులకు ఆమోదముద్ర వేయనున్నారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.