వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యూలైన్లను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. జనవరి 6 వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల్లో వచ్చే భక్తుల కోసం భారీ ఎత్తున క్యూలైన్లను, తాత్కాలిక షెడ్లను తితిదే ఏర్పాటు చేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు అనుసంధానంగా నారాయణగిరి ఉద్యానవనాలు, కళ్యాణ వేదిక నుంచి శ్రీవారి సేవా సదనం భవనాల వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లను ఆయన పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీవీఎస్వో, అర్బన్ ఎస్పీతో చర్చించారు.
ఇదీ చదవండి:'శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే'