తిరుమాఢ వీధుల్లో రథసప్తమి ఏర్పాట్లను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వాహనసేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరిగేలా జాగ్రత్తలు వహించాలని ఇంజినీరింగ్, అన్నప్రసాదం, విజిలెన్స్ విభాగాల అధికారులకు సూచనలు చేశారు.
భక్తులకు అవసరమైన తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, మరుగుదొడ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సూర్యజయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనసేవలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఇదీ చదవండి: