తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో 16 గంటల పాటు అఖండ సుందరకాండ పారాయణం నిర్వహించనున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఇందులో భాగంగా మే 31వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రార్థనా మందిరంలో ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.