ETV Bharat / city

తితిదే జేఈవో బసంత్‌కుమార్‌ బదిలీ - Transfer of Titidae Jeevo Basant Kumar latest news

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సంయుక్త కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి బసంత్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఆయనను తదుపరి పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల పరిశీలకుడిగా మాత్రం ఆయన సేవలు కొనసాగుతాయని స్పష్టంచేసింది.

ttd basanth transfer
ttd basanth transfer
author img

By

Published : Feb 5, 2021, 9:48 AM IST

బసంత్‌కుమార్‌ని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయనను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం... వేరే అధికారుల పేర్లతో ఎస్‌ఈసీకి మరో ప్యానల్‌ను పంపించింది.

బసంత్‌కుమార్‌కి బదులు వివేక్‌ యాదవ్‌ని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బసంత్‌కుమార్‌ను తితిదే జేఈవో స్థానం నుంచి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.