రాష్ట్రప్రతి రాంనాథ్ కోవింద్ రేపు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తితిదే, ప్రభుత్వ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు చెన్నై నుంచి భారత వైమానిక దళ విమానంలో రేణిగుంట చేరుకోనున్న రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి విజయవాడ వెళ్లిపోనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతితో పాటు తిరుమల పర్యటనలో కొనసాగనున్నారు.
షెడ్యూల్ వివరాలు...
విమానాశ్రయం నుంచి పదకొండు గంటలకు తిరుచానూరు చేరుకోనున్న రాష్ట్రపతి... శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని 12.15 నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. అనంతరం 12.50గం.కు శ్రీ వరాహస్వామిని, శ్రీవారి దర్శించుకొని తిరిగి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకొన్న అనంతరం 3 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న రాష్ట్రపతి... 3.50 నిమిషాలకు భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రాష్ట్రపతి పర్యటనలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి