రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులపైనా వైరస్ పంజా విసురుతోంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో 40 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ వెల్లడించారు.
ఆస్పత్రిలోని సీనియర్, రెసిడెంట్ వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిపారు. ఈ క్రమంలో కరోనా విస్తృతి తగ్గించడానికి మంగళవారం నుంచి శనివారం వరకు ఓపీ సేవలు రద్దు చేశారు.
ఇదీ చదవండి