కేంద్ర ప్రభుత్వం అందించే ఆకర్షణీయ నగరాల పోటీలకు తిరుపతి అర్హత సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తెలిపారు. స్మార్ట్ సిటీ అవార్డులకు దేశంలోని 100 నగరాలు పోటీపడగా...తిరుపతి నగరం ఆరు విభాగాల్లో అర్హత సాదించిందన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో అర్హత సాధించిన నగరాలు..ఆయా నగరపాలక సంస్థలో ఆకర్షణీయ నగరం ప్రాజెక్ట్‌లో భాగంగా అమలవుతున్న కార్యక్రమాలపై కేంద్రానికి వివరాలు అందించాల్సి ఉందన్నారు.
11న సాంస్కృతిక, వినూత్న ఆవిష్కరణలపై..,12న ఆర్థికాభివృద్ధి, పారిశుద్ధ్యంపై వివరాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. 13న సామాజిక అంశాలు, నగర పర్యావరణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణల విభాగంలో నీటిపై తేలియాడే సౌరవిద్యుత్ ఉత్పాదన కేంద్రం, ఆర్థికాభివృద్ధి అంశాలపై వ్యర్థాల నుంచి సంపద సృష్టికి అమలు చేస్తున్న పథకాలపై ప్రదర్శన ఇవ్వడానికి చర్యలు తీసుకొంటున్నామని కమిషనర్ వివరించారు.
ఇదీచదవండి