బంగారం, నగదు చోరీకి గురైన కేసుని తిరుపతి సీసీఎస్ పోలీసులు ఛేదించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ మునిరామయ్య వివరించారు. తిరుపతి బ్యాంకర్స్ కాలనీలో ఫర్నీచర్ షోరూం యజమాని నివాసంలో ఇటీవల చోరీ జరిగింది. గతంలో ఫర్నీచర్ షోరూంలో పనిచేసి.. మానేసిన వీరనాగులు.. మరో ఇద్దరితో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.12లక్షల 69వేలు, 207 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటో, ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ లను స్వాధీనం చేశారు.
ఇదీ చదవండి: