ETV Bharat / city

One Station One Product: ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానం... తిరుపతికి లాభదాయకం - తిరుపతి తాజా వార్తలు

One Station One Product: స్థానిక పరిశ్రమలను పటిష్ఠపరచాలనే ప్రధాన లక్ష్యంతో స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి రైల్వేస్టేషన్‌ను ఒక హబ్‌గా, ప్రదర్శన శాలగా రూపొందించాలనేది ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానం. ఈ విధానాన్ని 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దీనిని అమలుచేయడానికి రాష్ట్రంలో మొదటి రైల్వేస్టేషన్​గా తిరుపతిని ఎంపిక చేశారు.

One Station One Product in tirupathi
‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానం
author img

By

Published : Mar 15, 2022, 6:46 PM IST

One Station One Product: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (2022-23) లో ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్‌ను ఒక హబ్‌గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి, సంక్షేమాన్ని మెరుగుపరిచి స్థానిక పరిశ్రమను బలోపేతం చేకూర్చాలనేది ప్రధాన లక్ష్యం. స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి ఒక మార్కెటింగ్‌ వ్యవస్థగా ఉండేందుకు స్టేషన్‌లో స్టాల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తారు.

సాధారణంగా రైల్వేస్టేషన్లు జనాభా రద్దీ ప్రాంతాలుగా, ఉత్పత్తి మార్కెటింగ్‌కు ప్రధాన ప్రాంతాలుగా ఉంటాయి. ఈ విధానంలో స్థానిక ప్రాంతాలలో ప్రముఖమైన ఆహార పదార్థాలు, హస్తకళలు, స్థానిక బొమ్మలు, తోలు ఉత్పత్తులు, వస్త్రాలు, సంప్రదాయ వస్తువులు, వాయిద్య సాధనాలు మొదలగు వాటి మార్కెటింగ్‌, ప్రోత్సాహకం కోసం స్టాల్స్‌ ఏర్పాటుకు స్టేషన్‌ ప్లాట్‌ఫారాలపై తగిన స్థలం కేటాయిస్తారు.

పైలట్​ ప్రాజెక్ట్​గా ప్రారంభం...

ప్రారంభ దశలో 15 రోజులు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు పరిచేందుకు ప్రతి జోనల్‌ రైల్వేలో ఒక స్టేషన్‌ గుర్తించాలని రైల్వే బోర్డు సూచించింది. దీని ప్రకారం 25 మార్చి 2022 నుంచి 15 రోజులు పైలట్‌ పద్ధతిన ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ను అమలు పరచడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి స్టేషన్‌గా తిరుపతిని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి బాలాజీ దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి స్టేషన్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి స్టేషన్‌ పరిసర ప్రాంతాలు కలంకారి పెయింటిగ్స్‌కు ప్రఖ్యాతమైనవి. తదనుగుణంగా కలంకారి చీరలు, వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ స్టేషన్‌ను ఎంపిక చేశారు. దీనికి అదనంగా ఈ ప్రాంతంలో రూపొందించిన ఉడ్‌ క్రాఫ్టింగ్‌ వంటి ఇతర బహుళ ఉత్పత్తుల ప్రదర్శనకు/ అమ్మకానికి అనుమతి ఇస్తారు.

స్టాల్‌ ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యాంశాలు

  • రోజుకు సుమారుగా 500 రూపాయలు నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ చెల్లింపుతో స్టాల్స్‌ కేటాయిస్తారు.
  • స్టేషన్‌లో రైలు ఎక్కే/దిగే ప్రాంతాలకు అనుకూలంగా ఉండే దగ్గర స్టాల్‌/కియోస్క్‌ ఏర్పాటు చేస్తారు.
  • ప్రధాన రైళ్ల మార్గాల వద్ద ప్రయాణికులు కూడా ఉత్పత్తులను అమ్మే విధంగా అనుమతులు ఇస్తారు.
  • స్టేషన్‌ సూపరింటెండెంట్‌ స్టేషన్‌లోకి ప్రవేశానికి (విక్రయదారులకు గుర్తింపు కార్డు) అనుమతి ఇస్తారు. అందులో అధీకృత విక్రయదారుడి పేరు, ఉత్పత్తి పేరు, కేటాయించిన రోజులు స్పష్టంగా ఇస్తారు. దీంతో అనధికారికంగా విక్రయాలను అరికట్టవచ్చు.
  • ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ పథకం అని స్పష్టంగా తెలియజేసేలా అధీకృత విక్రయదారులకు బ్యాడ్జీలు ఇస్తారు.
  • స్టాల్స్‌ కేటాయించిన వారు ప్లాట్‌ఫారంపై అమ్ముకోవచ్చు లేదా తదుపరి స్టేషన్‌ వచ్చే వరకు రైళ్లలోనూ అమ్ముకోవచ్చు.
  • డిజిటల్‌ చెల్లింపులు : డిజిటల్‌ ఇండియా లక్ష్యంలో భాగంగా డిజిటల్‌ విధానంలో చెల్లింపులు ప్రోత్సాహిస్తారు.
  • స్టాల్స్‌ కేటాయింపులు : స్థానికంగా ఉన్న సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ ( ఎస్‌హెచ్‌జి), ఎన్‌జీఓలు, కో-ఆపరేటివ్‌ డీలింగ్స్‌ వారి సహకారంతో గుర్తింపు పొందిన ఉత్పత్తుల కళాకారులను, చేతివృత్తిదారులను, చేనేత మహిళలను ఎంపిక చేస్తారు. దీనికి అదనంగా, ఆసక్తి గలవారు గుంతకల్‌ సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వారికి వారు ఉత్పత్తుల వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే బహిరంగ లాటరీ, బహిరంగ డ్రా విధానం ద్వారా మాత్రమే కేటాయిస్తారు.

ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై స్పందించిన ప్రభుత్వం.. సారా అక్రమ నిల్వదారులపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.