తిరుమలలోని శ్రీవరాహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణలో భాగంగా రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు అదనపు పరకామణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సేనాధిపతి ఉత్సవం, పుణ్యాహవచనం, మేదినిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం నుంచి వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించి.. 10న బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు.
ఇదీచదవండి
నకిలీ మందులొస్తున్నాయా? 'ఫార్మర్ కనెక్ట్' యాప్ ఇన్స్టాల్ చేయండి!