శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించారు. చివరగా చందనం పూత పూసి... ధూపదీప హారతులు నివేదించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు.


ఇదీ చదవండి: సోనూ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: ప్రియాంక