తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తరలింపు కార్యక్రమాన్ని తితిదే ప్రారంభించింది. తిరుమలలోని లడ్డూల నిల్వ కేంద్రం నుంచి లక్షా 20వేల లడ్డూలతో 2 లారీలు బయలుదేరాయి. ఈ వాహనాలను అదనపు ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ నెల 25వ తారీఖు నుంచి లడ్డూ ప్రసాదాలను 13 జిల్లాలోని తితిదే కల్యాణ మండపాల్లో భక్తులకు అందజేయనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భక్తులకు లడ్డూలను అందించనున్నారు. మిగిలిన జిల్లాలకు లడ్డూలను రేపు తరలిస్తారు. ఈ విషయంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భక్తుల కోరిక మేరకే లడ్డూలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో కలసి భౌతిక దూరం పాటిస్తూ లడ్డూలను విక్రయిస్తామన్నారు.
ఇవీ చదవండి: