తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటాను రేపు ఉదయం 11 గంటలకు తితిదే వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండడంతో... 18 నుంచి 27 తారీఖు వరకు ప్రత్యేక ప్రవేశదర్శనాన్ని తితిదే రద్దు చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న సందర్భంగా 300 రూపాయల టికెట్ దర్శనాన్ని రద్దు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి నీటి విడుదల