ETV Bharat / city

తిరుమల భక్తుల సంగతేమిటో..!

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మే నెలకు సంబంధించి తితిదే రోజుకు 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను జారీచేసింది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారుగా 10వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో తితిదే జారీచేసిన దర్శన టికెట్ల కన్నా తక్కువగానే భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూను విధించింది.

tirumala
tirumala
author img

By

Published : May 5, 2021, 11:35 AM IST

తిరుపతిలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూతోపాటు మధ్యాహ్నం నుంచి స్వచ్ఛంద కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇది శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండటంతో ఇప్పటికే కొంత మంది టికెట్లను బుక్‌ చేసుకున్నారు. దర్శనం బుక్‌ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలకు తమ సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకుంటున్నారు. రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తే అత్యవసర సేవలు మినహా మిగిలిన పనుల కోసం ప్రజలను అనుమతించరు. సొంత వాహన రాకపోలను నిలిపివేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల దర్శన టికెట్ల ఆధారంగా అనుమతించే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ప్రస్తుతం భక్తుల్లో సందిగ్ధత నెలకొంది.

తితిదే ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కరవు

ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పగటి పూట కర్ఫ్యూ ప్రారంభమవుతున్న సందర్భంగా తితిదే ఉన్నతాధికారులు భక్తులు దర్శనానికి రావొచ్చా లేదా అనే దానిపై స్పష్టమైన ప్రకటన జారీ చేయాల్సి ఉంది. అయితే దీనిపై తితిదే అధికారుల నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎటువంటి ప్రకటన జారీ కాలేదు. బుధవారం నుంచి కర్ఫ్యూ ప్రారంభమవుతున్న వేళ సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. సదరు నిర్ణయాన్ని త్వరితగతిన వెల్లడి చేస్తే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అందుకు తగిన విధంగా తమ ప్రయాణాల ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.