తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రారంభమైన చిన్నశేష వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. చిన్నశేషవాహనంపై జీవకోటిని ఉద్దరించే లోకమాతగా అమ్మవారు దర్శనమిచ్చారు. వాహన సేవను వీక్షించడం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఆలయ మాఢవీధులలో అమ్మవారు విహరిస్తూ భక్తులకు అభయప్రధానం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూరహరతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కభజనలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు భక్తులను అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం పెదశేష వాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రికి హంస వాహన సేవ జరగనుంది.
ఇవీ చూడండి: