తిరుమల శ్రీవారి(tirumala balaji)కి మూడున్నర కిలోల బంగారం విరాళంగా అందింది. కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్‌సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.83 కోట్ల విలువ గల.. 3.604 కేజీల బంగారం బిస్కెట్లు స్వామివారికి కానుకగా అందించింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో.. అదనపు ఈవో ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు ఈ బంగారాన్ని అందజేశారు. అనంతరం ఆలయార్చకులు.. సంస్థ ప్రతినిధులకు ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఇదీ చదవండి: