తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నేడు ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి, శివసేన ప్రధాన కార్యదర్శి మిలింద్ నవరేఖర్.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
డీఆర్డీవో తయారు చేసిన సంచులను తిరుమలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన సంచులను డీఆర్డీవో అభివృద్ధి చేసిందని.. శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లేందుకు వీలుగా సంచులను అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ.. నిరాడంబరంగా బారాషహీద్ దర్గా గంధమహోత్సవం.. పాల్గొన్న మంత్రి అనిల్