ETV Bharat / city

'సీఎం జగన్, సోము వీర్రాజు కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారు' - వైకాపా, భాజపాపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపణలు

వైకాపా, భాజపాపై..మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెదేపా ఓట్లు చీల్చేందుకు.. వైకాపాకు భాజపా అనుకూలంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

ex minister jawahar fired on cm jagan, bjp state chief somu veerraju, mlc budha venkanna allegations on ycp, bjp
సీఎం, సోము వీర్రాజుపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం, వైకాపా భాజపాపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపణలు
author img

By

Published : Apr 3, 2021, 3:32 PM IST

సీఎం జగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కలిసి ఆడుతున్న దొంగనాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. జైలుకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి.. భాజపా రక్షణతో పరిపాలన సాగిస్తున్నారని అందరికీ తెలుసని వీడియో సందేశంలో పేర్కొన్నారు. నీలం సాహ్ని.. సీఎం జగన్ బంట్రోతులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొంగ, పోలీసు ఒక్కటి కావడంతో ఎన్నికలకు వెళ్లకూడదని నిర్ణయించామన్నారు. వైకాపా శ్రీరంగ నీతులు చెప్పడం ఆపి.. దమ్ముంటే ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని సవాల్ విసిరారు.

"తెదేపాను కించపరిస్తే సహించేది లేదు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వాళ్లు పోటీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత ? ఆ పార్టీ కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటే. నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ నేతలు ప్రగల్భాలు పలకడం తగదు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలను కళ్లుండి చూడలేకపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున.. రాష్ట్రంలో పరిస్థితులపై పోరాడకుండా, తెదేపా మీద ఆరోపణలు చేస్తున్నారు" అంటూ సోము వీర్రాజుపై జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా ఓట్లు చీల్చేందుకే...

తెదేపా ఓట్లు చీల్చేందుకు.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కార్యకర్తల కోసమే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్లు.. తిరుపతి ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో.. తెదేపా అభ్యర్థులపై వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలు, అరాచకాలకు దిగిందన్నారు. అభ్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. డబ్బు, అధికారం, పోలీసులు అనే మూడు రత్నాలు.. అధికార పార్టీకి ఎన్నికల్లో పని చేశాయన్నారు.

ఇదీ చదవండి:

అధికార పార్టీ సేవలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం: భాజపా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.