ETV Bharat / city

ఆ పత్రాల కోసమే.. మా ఇంటిపై వైకాపా వర్గీయుల దాడి: తెదేపా నేత రవి

YCP Attack on TDP leader house: అధికార పార్టీ నేతల బెదిరింపులు రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెదేపా నాయకులపై, ఇళ్లపై తరుచూ ఏదో ఒకచోట దాడులకు తెగబడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

YCP Attack on TDP leader house
YCP Attack on TDP leader house
author img

By

Published : Jun 7, 2022, 3:28 PM IST

Updated : Jun 8, 2022, 8:53 AM IST

ఆ పత్రాల కోసమే..మాఇంటిపై వైకాపా వర్గీయుల దాడి -తెదేపా నేత రవి

YCP Attack on TDP leader house: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత, గంగమ్మ ఆలయ పాలకవర్గం మాజీ ఛైర్మన్ రవి నివాసంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడింది వైకాపా వర్గీయులేనని ఆరోపిస్తూ రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి సంబంధించి డిపాజిట్ పత్రాలను ఇవ్వాలంటూ... వైకాపా నేతలు ఫోన్​లో బెదిరించారని మాజీ ఛైర్మన్ రవి వివరించారు. అలాంటివేమి పత్రాలేవీ తన దగ్గర లేవన్నందుకే..తన ఇంటిపై రాళ్లు, మద్యం సీసాలతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక తెదేపా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ: వైకాపా గూండాల కారణంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవి ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో అర్ధరాత్రి దాడి చేయడం వైకాపా అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆయన లేఖ రాశారు. వైకాపా నేతల దాడి ఫొటోలు, సీసీ టీవీ పుటేజీలను లేఖకు జత చేశారు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో వైకాపా నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. పోలీసుస్టేషన్​కు 200 మీటర్ల దూరంలో ఉన్న రవి ఇంటిపై దాడి చేశారు. ఆయనకు ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా.. ఇంటిపై దాడికి తెగబడటం దుర్మార్గం. కారణమైన వైకాపా నాయకులు సెంథిల్, శ్రీనివాసులు, కోదండంపై కేసు నమోదు చేయాలి. కుప్పంలో ప్రశాంతత దెబ్బతినకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి' అని లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు దాడి ఘటనపై పార్టీ నేతలతో ఆయన ఫోన్​లో మాట్లాడారు. గంగమ్మ ఆలయ ఛైర్మన్​గా ఉన్నప్పుడు రవి రూ.35లక్షలు ఫిక్స్​డ్ డిపాజిట్ చేశారు. ఈ విషయంలో కొంతకాలంగా వైకాపా వారు బెదిరిస్తున్నారు. దాడికి 2గంటల ముందు కూడా ఫోన్ చేసి బెదిరించారు' అని స్థానిక నాయకులు చంద్రబాబుకి వివరించారు.​

ఇవీ చదవండి :

Last Updated : Jun 8, 2022, 8:53 AM IST

For All Latest Updates

TAGGED:

Ycpdhaadi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.