SV zoological park curator: తిరుపతి జిల్లాలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో చిరుతల సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా వస్తున్న వదంతులను ఎస్వీ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మాధవరావు కొట్టి పారేశారు. జూ పార్కు సిబ్బంది, జంతువులను చిరుత గాయపరిచిందని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రదర్శనశాల మొత్తం శేషాచల అడవులల్లో ఉండటంతో చిరుత పులులు పార్కు సమీపంలో సంచరిస్తూ ఉంటాయన్నారు. అయితే ఇప్పటివరకు సిబ్బంది, సందర్శకులకుగానీ ఎలాంటి హాని తలపెట్టలేదని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఈ వదంతులు వచ్చినప్పటి నుంచి జూ పార్కులో రాత్రిపూట పెట్రోలింగ్ మరింత పెంచామన్నారు. సందర్శకులకు అన్ని రకాల జాగ్రత్తలు తెలియజేస్తూ.. నిఘా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సందర్శకులు, సిబ్బంది ఈ అవాస్తవాలని నమ్మొద్దని.. ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా పార్కును సందర్శించవచ్చని మరోసారి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: