తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీజీ కోర్సుల ప్రవేశాల్లో వర్సిటీ అధికారులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ సంఘాల నాయకులు ఆరోపించారు. నకిలీ టీసీలతో.. పీజీ కోర్సుల్లో కొందరు ప్రవేశాలు పొందారన్నారు.
ఇందుకు అధికారులు సహకరించారని.. అవినీతికి పాల్పడ్డారని ఆందోళన చేశారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరినీ సస్పెండ్ చేయలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం.. విశాఖ రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే గంటా ఆహ్వానం