ETV Bharat / city

Suicide: ఆ ఎస్సై అంతా నువ్వే అన్నాడు.. ముఖం చాటేశాడు.. అనంతపురంలో దారుణం.. - ఎస్సై ప్రేమించి మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య

Suicide: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వివాహితుడైన ఓ ఎస్సై మరో యువతిని ప్రేమ పేరుతో మోసం చేయటంతో.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముఖం చాటేశాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని.. రెండు రోజుల క్రితం పురుగులమందు తాగింది. నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు.

student committed suicide as SI trapped her in ananthapur
ఎస్సై ప్రేమించి మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : May 7, 2022, 11:31 AM IST

Updated : May 7, 2022, 12:11 PM IST

Suicide: అనంతపురం జిల్లా పామిడి మండలం జి.ఏ కొట్టాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఎస్సై ప్రేమించి మోసగించాడని.. మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఎస్సై విజయ్ కుమార్.. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముఖం చాటేశాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని.. రెండు రోజుల క్రితం పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనంతపురంలో మృతిచెందింది.

ఎస్సై ప్రేమించి మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య

ఎస్సై విజయ్ కుమార్ మోసం చేయడం వల్లే తమ కూతురు చనిపోయిందని.. బాధిత యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే సదరు ఎస్సై.. గతంలో కూడా ఓ అమ్మాయిని మోసం చేయడంతో.. ఆమె దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉద్యోగం పోతుందని.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఘటన మరవకముందే మరోసారి.. ప్రేమించి మోసం చేయడంతో.. గ్రామస్తులు ఎస్సై పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి మృతికి కారణమైన.. అతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినితో పాటు మరో యువతిని ప్రేమించాడని.. ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి. రెండో యువతి దిశ పోలీసులను ఆశ్రయించడంతో.. ఉద్యోగం పోతుందనే కారణంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహితుడైన ఎస్‌.ఐ. విజయకుమార్‌ మరో యువతిని ప్రేమ పేరుతో మోసం చేయటం చర్చలకు తావిస్తోంది.

ఎస్‌.ఐ. విజయకుమార్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు.. తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. ఇవాళ విజయకుమార్‌ను రిమాండ్‌కు పంపుతున్నట్లు వివరించారు.ఎస్సైపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయన్న డీఎస్పీ.. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​ జంట హత్య కేసులో ఆసక్తికర విషయాలు...మర్డర్​కు ముందు..!

ఈ లాయర్ అందాలు కేక... హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదుగా!

Last Updated : May 7, 2022, 12:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.