తిరుమల శ్రీవారి ప్రతి రోజు సుప్రభాతం, తోమాల, కొలువు సేవలు నిర్వహించిన అనంతరం స్వామివారికి సహస్రనామారన నిర్వహిస్తారు. ఈ సేవ ఉదయం 4.45 నుంచి 5.30 గంటల వరకు నిత్యం జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి వెయ్యి నామాలతో స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరు లకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇవ్వటంతో పూర్తవుతుంది.
ఇవీ చూడండి-శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తరలిన శ్రీవారి గొడుగులు