భాజపా-జనసేన కలిసి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, ఎంపీ జి.వి.ఎల్ నరసింహరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధితో పాటు ... వైకాపా, తెదేపా వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : దూసుకొస్తున్న నివర్...ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు