తిరుపతిలోని పద్మావతిపురంలో అగి ఉన్న ద్విచక్ర వాహనంలోకి నాగు పాము(Snake) దూరి హల్చల్ చేసింది. సుమారు అరగంటపాటు ద్విచక్ర వాహనంలో ఉన్న పాము(Snake) ప్రజలను భయాందోళనకు గురి చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనంలో ఉన్న పాము(Snake)ను బయటకు తీసేందుకు.. ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరకు వాహనంలో ఊపిరాడక పాము(Snake) ప్రాణాలు కోల్పోయింది.
పద్మావతి నగర్ పార్కులో ఏడడుగుల పాము
తిరుమలలోని పద్మావతి నగర్ పార్కులోకి ఏడడుగుల పాము(Snake) ప్రవేశించింది. పాము సంచారాన్ని గమనించిన పారిశుద్ధ్య కార్మికులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి:
Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'