ETV Bharat / city

రుయా ఘటనపై ప్రభుత్వ చర్యలు.. విపక్షాల విమర్శలు!

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. అక్కడ వైద్య సేవలను అధికారులు పునరుద్ధరించారు. ఘటనపై విచారణ వ్యక్తం చేసిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. మరోవైపు ప్రాణవాయువు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఘటనపై వెంటనే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి.

ruya hospital incident
రుయా ఘటనపై ప్రభుత్వ చర్యలు.. విపక్షాల విమర్శలు!
author img

By

Published : May 11, 2021, 9:47 PM IST

రుయా ఘటనపై ప్రభుత్వ చర్యలు.. విపక్షాల విమర్శలు!

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతిచెందిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. వెనువెంటనే వైద్యసేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఆక్సిజన్ నిల్వలు పెంచారు. తమిళనాడు నుంచి మరో ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు తెప్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. ట్యాంకర్స్ సకాలంలో రాకపోవడం ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బందిపడ్డారని.. ప్రస్తుతం వారంతా కోలుకున్నారని చెప్పారు.

ప్రతిపక్షాల మండిపాటు..

రుయా విషాదంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘటనపై పూర్తి సమాచారం సేకరించి పంపాలని.. ఏడుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీ నియమించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు బాధితులను పరామర్శించేందుకు రుయా వద్దకు వచ్చిన తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మృతుల బంధువులను కలిసేందుకు వెళ్లనివ్వాలంటూ ఆస్పత్రి ఎదుట సీపీఐ, తెలుగుదేశం నాయకులు ఆందోళన నిర్వహించారు. విపత్తు నిర్వహణ చట్టం కింద.. కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నందున ఆందోళనలు విరమించాలని పోలీసులు వారిని కోరారు. ఎంతకీ వెనక్కి తగ్గకపోవడం వల్ల.. అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

రుయాకు వచ్చేందుకు యత్నించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను నగరి పోలీసులు అడ్డుకొన్నారు. అక్కడి నుంచి స్వగ్రామం ఐనంబాకం వద్దకు తీసుకెళ్లి గృహ నిర్భంధం చేశారు. ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం అన్నది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని నారాయణ మండిపడ్డారు. దాదాపు 26 మంది చనిపోతే కేవలం 11 మంది చనిపోయినట్లు చెబుతోందని ఆక్షేపించారు.

పాలకులపై చర్యలు తీసుకోవాలి: వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు

రుయా దుర్ఘటనఘటనకు బాధ్యులైన పాలకులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు డిమాండ్​ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో రెండు ఘటనలు జరిగిన తర్వాత పాలకులు అప్రమత్తం కాకపోవడం దురదృష్టకరమన్నారు. రుయా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

10లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం పరిహారం..

రుయా ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ వాహనం రావడం ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ

'మోదీ జీ... ఆ అద్దాలు తీసి చూడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.