తిరుమల క్షేత్రంలో ఆత్మహత్యలు తగదు తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో తూర్పు మాఢ వీధిలో గుర్తు తెలియని భక్తుడు ఆత్మహత్యకు పాల్పడటం వల్ల శ్రీవారి కైంకర్యాలకు ఆలస్యమైందని, భక్తుల దర్శనానికి అంతరాయం ఏర్పడిందని తితిదే ఆగమసలహా మండలి సభ్యుడు రమణదీక్షితులు తెలిపారు. తిరుమల మాఢ వీధుల్లో బలవన్మరణాలకు పాల్పడటం మహాపాపమని ఆయన అన్నారు. ప్రకృతి సిద్ధంగా తిరుమలలో మరణం సంభవిస్తే స్వామివారి అనుగ్రహంగా భావించాలన్నారు. మాఢ వీధుల్లో మరణించడం వల్ల ఆగమ శాస్త్రోక్తంగా శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించి కైంకర్యాలు చేపట్టామని అన్నారు. మూఢ నమ్మకాలతో తిరుమలలో ఆత్మహత్యలకు పాల్పడటం తగదన్నారు.
ఇదీ చదవండి:
తిరుమలలో వ్యాను కిందపడి వ్యక్తి ఆత్మహత్య ..!