రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు... అన్ని శాఖల్లో పొదుపును పాటిస్తున్నట్లు శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రాజన్నదొర తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో తితిదే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. తితిదే ఆదాయవ్యయాలపై చర్చించారు. భక్తులు స్వామివారికి సమర్పిస్తున్న కానుకలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఆదా చేయాలని అంచనాల కమిటీ సూచించిందన్న ఆయన... అన్నిచోట్ల తితిదే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీ చదవండి..