తిరుపతిలో బ్లేడ్లతో కోసుకుని సైకోల వీరంగం - తిరుపతి రుయా ఆసుపత్రి వార్తలు
తిరుపతిలోని రుయా ఆస్పత్రి ప్రాంగణంలో నలుగురు సైకోలు వీరంగం సృష్టించారు. ఆస్పత్రి వద్ద హల్‌చల్ చేస్తోన్న ఉన్మాదులను భద్రతా సిబ్బంది నిలదీశారు. దీని వల్ల రెచ్చిపోయిన వారు... ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారు. ఇద్దరూ బ్లేడ్లతో పరస్పరం ఒంటిపై గాయాలు చేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో సిబ్బందిపై చిందులు వేశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
psychosis create nonsense In Tirupati