తితిదే జేఈవో బసంత్ కుమార్ నివాసంలో చోరీకి పాల్పడిన నిందితుడిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కరకంబాడీ రోడ్డులో ఇవాళ నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు..... అతడి నుంచి 6 లక్షల 45 వేల రూపాయల విలువైన 173 గ్రాముల బంగారం, 15,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న జేఈవో నివాసంలో దొంగతనానికి పాల్పడిన నిందితుడు విశాఖకి చెందిన పొగతోట గంగాధరరావు అలియాస్ కార్తీక్ అలియాస్ సిద్దార్థగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై గతంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తునిలో 30కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ రమేశ్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక బృందాల ద్వారా రెండు రోజుల్లోనే కేసును చేధించామని తెలిపారు.
ఇదీ చదవండి