పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న తితిదే.. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తోంది. డిసెంబర్ 25 నుంచి జనవరి మూడో తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు సర్వదర్శన టోకెన్లను తితిదే ఇప్పటికే జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. అనంతపురం జిల్లా హిందూపురం వచ్చిన భక్తుల వద్ద టికెట్లు లేకపోవటంతో తితిదే భద్రతా సిబ్బంది అలిపిరి గరుడ కూడలి వద్ద ఆపేశారు.
గోవిందమాల ధరించి కాలినడకన వందల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చిన తమను.. తిరుమలకు అనుమతించకపోవటంపై భక్తులు ఆందోళనకు దిగారు. దాదాపు వంద మంది భక్తులు అలిపిరి వద్ద నిరసన చేపట్టారు. తమను తిరుమలకు అనుమతించాలని.. దర్శనం లేకున్నా కొండపై దీక్ష విరమించి వెళ్లిపోతామని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: