ETV Bharat / city

పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్ - తిరుపతి వార్తలు

డేటా చౌర్యం... ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా అంతర్జాల విపణిలోకి వచ్చి పడిపోతున్న విదేశీ యాప్ లతో మన విలువైన సమాచారం సరిహద్దులు దాటిపోతుందనేది కేంద్ర ప్రభుత్వ వాదన. ప్రత్యేకించి చైనా మొబైల్, వెబ్ అప్లికేషన్లు.. భారత్​లోని వినియోగదారుల ప్రయోజనాలను విపరీతంగా దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలతో వాటి నియంత్రణపై దృష్టి సారించింది మోదీ ప్రభుత్వం. వాటిపై నిషేధాజ్ఞల పరంపరను ప్రారంభించింది. అదే సమయంలో దేశంలోని విజ్ఞానవంతులైన యువతను, వారి మేథోశక్తిని ప్రోత్సహించే విధంగా 'ఆత్మనిర్భర భారత్' నినాదాన్ని తీసుకువచ్చింది. దీన్ని ప్రేరణగా తీసుకుని విభిన్న ప్రత్యేకతలతో ఓ స్వదేశీ మొబైల్ అండ్ వెబ్ బేస్డ్ యాప్​నకు రూపకల్పన చేశాడు తిరుపతికి చెందిన యువకుడు వినయ్. 'పెంజ్ బాక్స్' పేరుతో రూపొందించిన ఈ యాప్​లోని విశిష్టతలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

penz box app special story
పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్
author img

By

Published : Sep 18, 2020, 8:17 PM IST

Updated : Sep 18, 2020, 9:45 PM IST

పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్

డేటా చౌర్యం, వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కడం వంటివి సామాజిక మాధ్యమాలు ఉపయోగించే వారు తరచూ ఎదుర్కొనే సమస్యలు. ఒక యాప్ ఉపయోగించడానికి మనం ఇచ్చే ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఎంతవరకు భద్రంగా ఉంటున్నాయో తెలియని పరిస్థితి. వీటికి మన దేశీయ యాప్​తోనే పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తిరుపతికి చెందిన వినయ్. 2018లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఇతను ఆత్మనిర్భర్ భారత్​కు మద్దతుగా మొబైల్, వెబ్ బేస్డ్ యాప్​కు రూపకల్పన చేశాడు. 'అదే పెంజ్ బాక్స్'

వన్ స్టాప్ డెస్టినీ ఫర్ ఆల్

పెంజ్ బాక్స్.. ఇతర మొబైల్ యాప్స్​లానే ఆండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ యాప్, వెబ్ బేస్డ్ యాప్​గా పనిచేస్తుంది. ఇందులో ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్ వంటి అప్లికేషన్లలో ఉండే ఫీచర్లు ఉంటాయి. 'వన్ స్టాప్ డెస్టినీ ఫర్ ఆల్' అనే టాగ్ లైన్​తో దాదాపు 10 యాప్స్​లలో ఉండే ఫీచర్లను ఇందులో పొందుపరిచాడు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, చాటింగ్, వీడియో కాల్స్, టెంప్లేట్స్ తయారుచేసుకోవడం, కొటేషన్ మేకర్స్, కలర్ బ్యాక్​గ్రౌండ్ థీమ్స్​ను అందుబాటులో ఉంచాడు. ఆన్​లైన్ పోల్స్​ను నిర్వహిస్తూ ఓ అంశంపై ప్రజల అభిప్రాయలు తెలుసుకునే అవకాశాన్ని పెంజ్ బాక్సులో కల్పించాడు. ఇవన్నీ ఇతర యాప్​లలోనూ ఉన్నా.. అన్ని ఫీచర్లు ఒకే యాప్​లో ఉండడం పెంజ్ బాక్స్ ప్రత్యేకతగా వినయ్ చెప్తున్నాడు.

యాప్​లోనే యూట్యూబ్ వీడియోలు

సాధారణంగా న్యూస్ ఫీడ్​లో అన్ని రకాల పోస్టులు, వార్తలు మనకు కన్పిస్తుంటాయి. అదే పెంజ్ బాక్స్​లో అయితే మనకు నచ్చిన వాటినే చూడొచ్చు. మరీ ముఖ్యంగా యూట్యూబర్స్​కి మేలు చేసే విధంగా పెంజ్ బాక్సులో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా యూట్యూబ్ వీడియో లింక్​ మనం పోస్ట్ చేస్తే థంబ్​నెయిల్​తో లింక్ మాత్రమే పేస్ట్ అవుతుంది. ఆ వీడియోను చూడాలంటే ఆ లింకుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాని పెంజ్​బాక్సులో నేరుగా యూట్యూబ్ వీడియో ప్లే అయ్యేలా ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ తరహా ఫీచర్ స్వదేశీ యాప్స్​లో ఓ విప్లవాత్మకమైన మార్పుగా వినయ్ అభివర్ణిస్తున్నాడు. అలాగే గ్రూపులో సభ్యుల సంఖ్యను అపరిమితం చేస్తూ ఫీచర్ పొందుపరిచాడు.

వ్యక్తిగత గోప్యత.. ఈ యాప్ ప్రత్యేకత

పెంజ్ బాక్స్​కు అన్నింటికంటే ప్రత్యేకతనిచ్చే విషయం.. వ్యక్తిగత గోప్యత. ఇందులో ఉండే ఏ వ్యక్తి వివరాలైనా ఆ వ్యక్తి బయోలో రాసుకుంటే తప్ప వేరేవారికి తెలిసే వీలులేదు. వినియోగదారుడి మొబైల్ నంబర్ హైడ్ చేసే ఆప్షన్ ఇందులో ఉంది. ఒకవేళ గ్రూపులో మనకు తెలియని వ్యక్తులు మనకి వ్యక్తిగతంగా మెసేజ్ చేయాలన్నా.... ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుని అటువైపు వాళ్లూ యాక్సెప్ట్ చేస్తేనే చాట్ చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే మహిళలకు ఈ తరహా ఫీచర్ ఓ భద్రతను కల్పిస్తుంది. ఓ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ను ఒక్కసారి మాత్రమే వినియోగించుకునే ఆప్షన్ పెట్టడం ద్వారా ఫేక్ అకౌంట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు వినయ్. ఫోన్​లో పదుల సంఖ్యలో పెద్ద మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్​ను వాడుకుంటూ ఉపయోగించే యాప్​లకన్నా.. లైట్ వెర్షన్​లో ఉండే ఈ ఒక్క యాప్​ను వినియోగించడం ద్వారా ఫోన్​పై పడే భారాన్ని తగ్గించవచ్చంటున్నాడు పెంజ్ బాక్స్ రూపకర్త వినయ్.

ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో మొదట్లో ఒంటరిగా ఈ యాప్ రూపకల్పన చేసినా.. తరువాత కొంతమంది స్నేహితులు తోడయ్యారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులున్న బృందం యాప్ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఆర్థికంగా పేదకుటుంబానికి చెందిన వాడైనా తనకున్న కొద్దిపాటి వనరులతోనే.. గూగుల్ ప్లేస్టోర్ లో పెంజ్ బాక్స్​ను లాంచ్ చేశాడు. ఎటువంటి ప్రచారం లేకపోయినా... మొదటి నెలలోనే 1200మంది యాప్​ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. వాడుతున్న వారంతా పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటున్న వినయ్....ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీ చదవండి...

గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి పేటీఎం ఔట్​..​

Last Updated : Sep 18, 2020, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.